అందరి చూపు.. ఆదిత్య ఎల్1 పైనే: నేడు తుది కక్ష్యలోకి చేరనున్న మిషన్

Update: 2024-01-06 06:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు తొలిసారిగా భారత్ ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ శనివారం సాయంత్రం 4గంటలకు తుది కక్ష్యలోకి ప్రవేశించనుంది. లగ్రాంజ్ పాయింట్-1 చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో శాటిలైట్‌ను ఉంచాలని ఇస్రో భావిస్తోంది. ఇది భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచే ఆదిత్య ఎల్1 సూర్యుడిని నిరంతరం పరిశీలించనుంది. హోలో ఆర్బిట్‌ పరిశోధనలకు సులభంగా ఉంటుందని, అక్కడి నుంచే సూర్యుడి పరిస్థితిని అంచనా వేయొచ్చని ఇస్రో తెలిపింది. కాగా, గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పంపారు. ఆ తర్వాతి రోజు ఈ శాటిలైట్ భూమి చుట్టు నాలుగు రౌండ్లు తిరిగింది. అదే నెల 19 నుంచి లగ్రాంజ్ పాయింట్-1 వైపుగా ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలోనే సుమారు నాలుగు నెలల తర్వాత దాని గమ్యస్థానానికి చేరుకోనుండటం గమనార్హం. 

Tags:    

Similar News