భయంకరంగా పెరిగిపోయిన గాలి కాలుష్యం.. తొలిసారి 1900 AQI
ఈ మధ్య ఢిల్లీలో ఏకంగా ఏక్యూఐ 500 దాటేసింది. పీఎం వేల్యూ కూడా 2.5 దాటేసింది. దీంతో ఢిల్లీలో ప్రజలు మాస్క్ లేనిదే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదంతా మన దేశంలో పరిస్థితి.
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ గాలి కాలుష్యం (AIR Pollution) పెరిగిపోతూ డేంజర్స్ బెల్స్ మోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఢిల్లీలో ఏకంగా ఏక్యూఐ 500 దాటేసింది. పీఎం వేల్యూ కూడా 2.5 దాటేసింది. దీంతో ఢిల్లీ (Delhi)లో ప్రజలు మాస్క్ లేనిదే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదంతా మన దేశంలో పరిస్థితి. ఇదే ప్రజాజీవనానికి చాలా ప్రమాదకరం అని డబ్ల్యూహెచ్ఓ (WHO) చెబుతోంది. అయితే అంతకు దాదాపు 4 రెట్లు వాయు కాలుష్యంతో ప్రమాద సూచికలన్నింటినీ దాటేసింది పాకిస్తాన్ (Pakistan)లోని లాహోర్ సిటీ. వాయు కాలుష్య ప్రమాణ సంస్థ ఐక్యూఏఐఆర్ ప్రకారం.. లాహోర్‌లో ఈ రోజు (సోమవారం) గాలి కాలుష్యం స్థాయి ఏకంగా 1900 ఏక్యూఐగా నమోదైంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత నగరంగా లాహోర్ (Lahore) ఓ చెత్త రికార్డ్‌ను కూడా మూటగట్టుకుంది.
ఇక ఇంత భారీ స్థాయిలో కాలుష్యం నెలకొనడంతో లాహోర్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం సదుపాయాలను కల్పించింది. వెహికల్ పొల్యూషన్ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ సీనియర్ మినిస్టర్ మరియం ఔరంగజేబ్ (Aurangazeb) వెల్లడించారు. అలాగే వారం రోజుల పాటు ప్రైమరీ స్కూల్స్ మూత వేస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలందరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని పేరెంట్స్‌కు సూచించారు