తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆకాశంలో ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయుసేనకు చెందిన అపాచీ ఏహెచ్-64 హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

Update: 2023-05-29 06:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆకాశంలో ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయుసేనకు చెందిన అపాచీ ఏహెచ్-64 హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోమవారం ఉదయం రొటీన్ ఆపరేషనల్ ట్రైనింగ్ కోసం ఆకాశంలోకి ఎగిరిన హెలికాప్టర్ లో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ను మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని ఓ గ్రామంలో ల్యాండింగ్ చేశాడు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో సహాయక సిబ్బందికి హెలికాప్టర్ దిగిన స్థలానికి పంపినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. పైలట్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News