తల్లీ గర్భంలోని శిశువు గుండెకు అరుదైన చికిత్స.. 90 సెకన్లలో పూర్తి చేసిన AIIMS వైద్యులు

ఢిల్లీలోని AIIMS వైద్యులు తల్లీ గర్భంలోని శిశువుకు అరుదైన చికిత్సను కేవలం 90 సెకన్లలో పూర్తి చేసి ఆరుదైన ఘనతను సాధించారు.

Update: 2023-03-15 03:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని AIIMS వైద్యులు తల్లీ గర్భంలోని శిశువుకు అరుదైన చికిత్సను కేవలం 90 సెకన్లలో పూర్తి చేసి ఆరుదైన ఘనతను సాధించారు. వివరాల్లోకి వెళితే.. ఓ 28 ఏళ్ల మహిళ గతంలో మూడు సార్లు ప్రెగ్నెన్సీని కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి గర్భం దాల్చడంతో ఆస్పత్రికి వచ్చింది. ఆమెను AIIMS వైద్యులు పరీక్షించారు.మహిళా గర్భంలోని పిండం యొక్క గుండె పరిస్థితి గురించి వైద్యులు తెలియజెప్పారు. ఈ సారి ఎలాగైనా గర్భాన్ని కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. దీంతో AIIMS వైద్యులు పిండం యొక్క గుండె కు చేయవలసిన చికిత్స గురించి వివరించారు. దీనికి తల్లిదండ్రులు సమ్మతించడం తో డాక్టర్లు కేవలం 90 సెకన్లలో చికిత్సను పూర్తి చేశారు.

Tags:    

Similar News