ఫ్యాక్ట్ చెక్ : ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం ?
దిశ, నేషనల్ బ్యూరో : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు సినీ, రాజకీయ ప్రముఖులకు తలనొప్పిగా మారుతున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు సినీ, రాజకీయ ప్రముఖులకు తలనొప్పిగా మారుతున్నాయి. దేశంలో ఎన్నికల వేడి రాచుకున్న ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా ఆ వాయిస్ క్లిప్‌లో ఆడియోను జోడించారు. ఏఐ వాయిస్, మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట చిత్రాలను మనం ఈ వీడియోలో చూడొచ్చు. దీన్ని కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘‘ఆ రోజు దగ్గరలోనే రానుంది.. అది జూన్ 4’’ అని కొందరు.. ‘‘రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’’ అంటూ ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఈ ఆడియో క్లిప్ ఏఐ వాయిస్ క్లోన్ అని కొన్ని డిటెక్షన్ టూల్స్ ఇప్పటికే నిర్ధారించాయి. ఆడియో క్లిప్ , వీడియో క్లిప్ రెండింటిని వేరు చేసి.. ఫ్యాక్ట్ చెక్ చేయగా ఈ క్లిప్ ఏఐ జనరేటెడ్‌గా ఉందని తేలింది. ఇటీవల ఇదే తరహాలో కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ఏఐ వాయిస్ క్లోన్ క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. అందులో ఆయన ఆర్టికల్ 370 గురించి మాట్లాడినట్టు ఉంది.