CBI : సందీప్ ఘోష్ ఇంట్లో 13 గంటల పాటు సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ‌‌‌లో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతం గురించే ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది.

Update: 2024-08-25 18:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ‌‌‌లో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతం గురించే ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో సీబీఐ తన దర్యాప్తును వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా కోల్‌కతాలోనే ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇంటిపై సీబీఐ అధికారులు రైడ్స్ చేశారు. దాదాపు 13 గంటల పాటు ఈ సోదాలు కొనసాగడం గమనార్హం. ఆ ఇంట్లో పలు కీలకమైన డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొని, వాటికి సంబంధించిన సమాచారం గురించి కుటుంబ సభ్యులను ఆరాతీసినట్లు తెలిసింది.

మరోవైపు మెడికల్ కాలేజీ మాజీ సూపరింటెండెంట్ సంజయ్ వశిష్ఠ్‌తో పాటు మరో 13 మంది ఇళ్లలోనూ సీబీఐ టీమ్స్ సోదాలు నిర్వహించాయి. వారికి చెందిన ఇళ్లు, ఆఫీసులను జల్లెడ పట్టాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ నుంచి కాంట్రాక్టులు పొంది, దానికి వివిధ రకాల మెటీరియల్స్‌ను సప్లై చేసిన సంస్థల ఆఫీసులపైనా రైడ్స్ జరిగాయి. లై డిటెక్టర్ పరీక్షలో ఈ కేసు నిందితులు అందించిన సమాచారం ఆధారంగానే సీబీఐ ఈ తనిఖీలు చేసినట్లు తెలిసింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హోదాను దుర్వినియోగం చేసి సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో ముడిపడిన సమాచారాన్ని రాబట్టేందుకే ఈ రైడ్స్‌ను సీబీఐ నిర్వహించిందని అంటున్నారు.


Similar News