వినేష్ ఫొగట్ అప్పీల్‌పై తీర్పు వాయిదా

పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫొగట్.. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరింది. తొలి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకి(జపాన్)‌ని మట్టికరిపించింది.

Update: 2024-08-13 16:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ ఫొగట్.. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరింది. తొలి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకి(జపాన్)‌ని మట్టికరిపించింది. రెండో రౌండ్‌లో ఉక్రెయిన్ ప్లేయర్ ఒక్సానా లివాచ్‌ను ఓడించింది. సెమీ ఫైనల్లో క్యుబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్ ఓడించి ఫైనల్ చేరింది. అనూహ్యంగా ఫైనల్‌కు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై ఒలంపిక్ యాజమాన్యం అనర్హత వేటు వేసింది. అయితే సెమీస్‌లో గెలిచాక బరువు పెరిగింది కాబట్టి కనీసం కాంస్య పతకం అయినా దక్కుతుందన్న ఆశతో అంతర్జాతీయ క్రీడా కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన కోర్టు తీర్పును వాయిదా వేసింది. తుది తీర్పును ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తుందా? రాదా? అని భారతీయులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News