ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బోయినపల్లి అభిషేక్‌కు మధ్యంతర బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకడైన బోయినపల్లి అభిషేక్ కు సుప్రీంకోర్టు ఐదు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

Update: 2024-03-20 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకడైన బోయినపల్లి అభిషేక్ కు సుప్రీంకోర్టు ఐదు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్.. ట్రయల్ కోర్టు అనుమతితో హైదరాబాద్ వెళ్లాలని ఆదేశించింది. దీంతో పాటు.. ఆయన విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదని.. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీకి చెందిన మంత్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో ఈడీ అధికారులో కస్టడిలో విచారణను ఎదుర్కోంటున్నారు.

Tags:    

Similar News