ఢిల్లీ లిక్కర్ స్కామ్‌: మనీష్ సిసోడియాకు మరోసారి షాక్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా మరోసారి షాక్ తగిలింది. అతడికి కోర్టు మరో రెండు రోజుల కస్టడీ పొడిగించింది.

Update: 2023-03-04 09:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా మరోసారి షాక్ తగిలింది. అతడికి కోర్టు మరో రెండు రోజుల కస్టడీ పొడిగించింది. గతంలో ఇచ్చిన కస్టడీ ముగియడంతో సీబీఐ ఇవాళ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా సిసోడియా విచారణకు సహకరించ లేదని, ఈ కేసులో మరికొందరితో కలిపి అతడిని విచారించాల్సి ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ కేసుకు సంబంధించి చాలా ఫైల్స్ మిస్ అయ్యాయని వాటి వివరాలపై ఆరా తీయాల్సి ఉందని అందువల్ల మరో మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించాలని అధికారులు కోరారు.

ఈ సందర్భంగా సిసోడియా తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతు మానసికంగా వేధిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో కొత్త ప్రశ్నలేమైన ఉంటే అడగాలని సీబీఐ అధికారులకు కోర్టు సూచించింది. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి సిసోడియాకు మరో రెండు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతినిస్తూ ఆర్డర్ ఇచ్చారు. దీంతో ఇప్పటికే ఐదు రోజుల పాటు విచారించిన సీబీఐ మరో రెండు రోజుల పాటు మనీష్ సిసోడియాను ప్రశ్నించనుంది. మరో వైపు సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కామ్: మాగుంట రాఘవకు కస్టడీ పొడిగింపు

Tags:    

Similar News