Delhi: ఢిల్లీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై ఆప్ విమర్శలు

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేల బృందం అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కోరగా, ఆమె తాజాగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించారు.

Update: 2024-09-10 13:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేల బృందం అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కోరగా, ఆమె తాజాగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆప్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఇప్పటికే బీజేపీ అంగీకరించింది. అందుకే బ్యాక్‌డోర్ ద్వారా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేబినెట్ మంత్రి అతిషి ఆరోపించారు.

ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడమే కాషాయా పార్టీ పని, సీఎం కేజ్రీవాల్‌కు బీజేపీ భయపడుతోంది, ఇది దాని కొత్త కుట్ర. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి జీరో సీట్లు వస్తాయని ఆమె విమర్శించారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు, తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. బీజేపీ త్వరగా ఓడిపోవాలని భావిస్తే, రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించాలని ఆయన అన్నారు.

మరోవైపు ఢిల్లీ బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, అవినీతి ఆరోపణలపై నాలుగు నెలలకు పైగా జైలులో ఉన్న కేజ్రీవాల్ రాజీనామా చేయడానికి నిరాకరించడం వల్ల పరిపాలన స్తంభించిపోయిందని, పాలన పూర్తిగా కుప్పకూలడానికి ఆయనే కారణమని అన్నారు. ఈ ఫిర్యాదు ప్రస్తుత 4 నెలల ప్రభుత్వం గురించి కాదు, గత 10 సంవత్సరాల పాలన గురించి కాదు. గత 10 ఏళ్లలో ఢిల్లీ ప్రభుత్వ పనితీరు గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అని గుప్తా చెప్పారు.


Similar News