భర్త బతికుండగానే వితంతువుగా మారిన మహిళ.. హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే?
భర్త బతికుండగానే ఓ మహిళ వితంతువుగా తిరిగిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: భర్త బతికుండగానే ఓ మహిళ వితంతువుగా తిరిగిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తాళి కట్టిన భర్త కళ్ల ముందే వితంతువుగా తిరిగితే ఆ భర్తకు ఇంతకుమించిన నరకం మరొకటి ఉండదు. నుదుటిన బొట్టు చెరిపేసి, చేతికున్న గాజులు తీసేసి, తెల్లని దుస్తులు ధరించి ఓ మహిళ తన భర్తకు నరకం చూపించింది. దీంతో ఆ భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకెళ్తే.. ‘‘ఢిల్లీకి చెందిన ఓ జంట.. 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. పాప పుట్టాక కొద్ది రోజులకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ వ్యక్తి తండ్రే ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టేవాడు. కాగా ఓసారి అతడు కాలుకు తీవ్రంగా గాయమైంది.
దీంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఈ ఘటన జరిగాక ఇంటికి వచ్చిన మహిళ భర్తకు సేవ చేయాల్సింది పోయి.. గాలులు తీసేసి, నుదుటన కుంకుమ తీసేసి, తెల్లని చీర కట్టుకుంది. తన భర్త చనిపోయినట్లుగా విదవగా చేస్తోంది. బయటకు కూడా అలాగే వెళ్తుండటంతో తట్టుకోలేని భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ఇద్దరి వాదోపవాదాలు విన్న కోర్టు.. భర్త బతికుండగానే భార్య వితంతువుగా ఉండటం కరెక్ట్ కాదు. అది ఏ భర్తకైనా దారుణమైన అవమానం. అతడు గాయపడినప్పుడు.. ఇలా చేయడం ఇంకా బాధ కలిగిస్తుంది. ఈ సమయంలో ఏ భర్త అయినా, తన భార్య నుంచి కాస్త శ్రద్ధ, దయ, జాలి ఆశిస్తాడు. ఇందుకు విరుద్ధంగా భార్య ప్రవర్తించడం క్రూరత్వమే. ఇలాంటి మహిళల వల్ల సమాజానికి మచ్చ వస్తుందని’’.. కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది.