Maharashtra Assembly Elections : 'మహా' ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వింత అభ్యర్థన

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో(Maharashtra Assembly Elections) ఓ అభ్యర్థి నుంచి అధికారులకు వింత అభ్యర్థన ఎదురైంది.

Update: 2024-11-17 13:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో(Maharashtra Assembly Elections) ఓ అభ్యర్థి నుంచి అధికారులకు వింత అభ్యర్థన ఎదురైంది. ఈనెల 20న మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారంతో అభ్యర్థుల, నాయకుల ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. అయితే ధారాశివ(Dharashiva) జిల్లాల్లోని పరాందా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థి అయిన గురుదాస్ శంభాజీ కాంబ్లే నుంచి ఎన్నికల అధికారులకు ఓ వింత అభ్యర్థన చేసారు. తన ఎన్నికల గుర్తు 'చెప్పులు'(Slippers) అని.. పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లు చెప్పులు ధరించి వెళ్ళడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి పోలింగ్ కేంద్రాల్లో చెప్పులు ధరించడం నిషేధించాలని ఎన్నికల అధికారులకు లేఖ రాశాడు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో చెప్పులు నిషేధించాలని.. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంబ్లే లేఖలో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనపై అధికారులు స్పందిస్తూ.. దీనిపై తమపై అధికారులను సంప్రదించి, వారి సూచనల ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు.  

Tags:    

Similar News