కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్.. ఆ బిల్లును తిరస్కరించిన మండలి

కర్ణాటక శాసనమండలీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలపై పన్ను విధింపు బిల్లును మండలి తిరస్కరించింది.

Update: 2024-02-24 06:07 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: కర్ణాటక శాసనమండలీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలపై పన్ను విధింపు బిల్లును మండలి తిరస్కరించింది. కాగా కర్ణాటకలోని ఎండోమెంట్ పరిధిలో ఉండి.. రూ కోటికి పైగా ఆదాయం ఉన్న ఆలయాలపై 10 శాతం, అలాగే ఐదు 10 లక్షల నుంచి కోటి లోపు ఆదాయం ఉన్న దేవాలయాలపై 5% పన్ను విధించాలని ఉద్దేశంతో అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన ఆమోదం తెలిపింది. అయితే కర్ణాటక శాసన మండలిలో బీజేపీకి సంఖ్యాబలం అధికంగా ఉండటం, అలాగే పలువురు సభ్యులు ఈ బిల్లు హిందూ వ్యతిరేకంగా ఉందని భావించడంతో.. శాసన మండలి ఆలయాలపై పన్ను విధింపు బిల్లును తిరస్కరించింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, ఈ ప్రభుత్వానిది హిందూ వ్యతిరేక ధోరణి అని కర్ణాటక బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది.


Similar News