నమాజ్ చేస్తున్న ముస్లింలను కాలితో తన్నిన పోలీస్ అధికారి!

రోడ్డు పక్కన ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఓ పోలీస్ అధికారి వారిని తన బూటు కాలితో తంతున్న ఘటన వివాదాస్పదమైంది.

Update: 2024-03-08 11:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు పక్కన ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఓ పోలీస్ అధికారి వారిని తన బూటు కాలితో తంతున్న ఘటన వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు శుక్రవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన దేశ రాజధాని ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్ ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది. శుక్రవారం కావడంతో ముస్లింలు రోడ్డు పక్కన ప్రార్థనలు చేపట్టారు. అయితే 'సజ్దా' సమయంలో ముస్లింలను ఓ పోలీసు అధికారి కొందరిని తన బూటు కాలుతో తన్నీ ప్రార్థనలు ఆపించి వేశారు. దీంతో వారు ప్రార్థన మధ్యలో లేవాల్సి వస్తుంది. వెంటనే కొందరు ఆగ్రహానికి గురై పోలీసు అధికారులతో వాగ్వాదం చేస్తారు.

దీనికి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దీనిపై విచారణ చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. పోలీసు అధికారిపై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొందరు పోలీసు అధికారి తీరును సమర్థించారు. ప్రార్థనలు మసీదుల్లో చేయకుండా రోడ్లపై చేయడం ఏమిటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీలో అధిక సంఖ్యలో మసీదులు ఉన్నాయని, అక్కడికి వెళ్లి ప్రార్థనలు చేయాలని, రోడ్లపై చేయడంతో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం నేపథ్యంలో పోలీసు అధికారి వారిని అలా తన కాలితో తన్నకుండా.. వారికి నచ్చజెప్పి పంపించి ఉండాల్సిందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.  

Tags:    

Similar News