యువకుడితో ముగ్గురు పిల్లల తల్లి ఎఫైర్.. ఇంట్లోనే ఉంచుకుంటానని భర్తముందే ఏం చేసిందో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా పలువురు జనాలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.

Update: 2024-04-04 13:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా పలువురు జనాలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నా కొందరు మారడం లేదు. ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తోన్న భార్యాభర్తల మధ్య ఉన్నట్లుండి గొడవలు జరగుతున్నాయి. ఈ గొడవలకు ఎక్కువగా అక్రమ సంబంధాలే కారణమని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలిద్దరిలో ఏ ఒక్కరి విషయంలోనైనా ఎఫైర్ బయటపడితే.. అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచంలో ఏ స్త్రీ కూడా తన భర్త చేసిన మోసాన్ని భరించలేదు. సహించదు కూడా.

అలాగే ఏ భర్త కూడా తన భార్య వేరే మగాడితో చనువుగా ఉండటాన్ని భరించలేడు. అయితే ప్రస్తుత రోజుల్లో కొంతమంది పెళ్లైన మహిళలు యువకులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే యూపీలో చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన 34 ఏళ్ల ముగ్గురు పిల్లల తల్లి ఓ యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. అంతేకాకుండా అతడ్ని తన ఇంట్లోనే ఉంచుకోవాలని భర్తను కోరింది. భర్త నిరాకరించడంతో ఆమె కరెంట్ స్తంభం పైకెక్కి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ, ఆ సమయంలో పవర్ లేకపోవడంతో స్థానికులు ఆమెను నిచ్చెన సాయంతో రక్షించారు. ఈ విషయాన్ని తట్టుకోలేని భర్త భార్యపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Similar News