కోల్‌కతా ఘటనలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కు లై డిటెక్టర్

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆ కాలేజీ ప్రిన్సిపల్ కు లై డిటెక్టర్ పరీక్షకు కోర్టు అనుమతినిచ్చింది.

Update: 2024-08-22 15:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆ కాలేజీ ప్రిన్సిపల్ కు లై డిటెక్టర్ పరీక్షకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసు సీబీఐ విచారణకు వెళ్ళిన అనంతరం దర్యాప్తు వేగంగా సాగుతోంది. అందులో భాగంగా ప్రధాన నిందితుడు సంజయ్ కి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం.. మరికొంత మందికి కూడా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని ప్రత్యేక కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఇందులో ఆర్జీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటు మరో నలుగురు డాక్టర్లకు ఈ పరీక్ష చేసే అవసరం ఉందని పిటిషన్ లో సీబీఐ పేర్కొనగా.. కోర్టు అనుమతులు జారీ చేసింది. వైద్యురాలి హత్యాచారం జరిగిన రోజు సందీప్ ఘోష్ తో పాటు ఆ నలుగురు డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు. విచారణ సమయంలో వీరంతా ఒకరికి ఒకరు పొంతన లేని సమాధానాలు చెప్పారని, అందువల్ల వారికి లై డిటెక్టర్ అవసరం అవుతుందని సీబీఐ పిటిషన్లో పేర్కొంది.    


Similar News