భవనంపై కూలిన భారీ క్రేన్.. ఆ ఇంట్లో పరిస్థితి ఏమిటంటే?

గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది.

Update: 2024-08-22 16:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పిపోయింది. సూరత్ లో జరుగుతున్న మెట్రో నిర్మాణ పనుల్లో ఓ భారీ క్రేన్ విరిగి ఓ భవనం మీద పడింది. క్రేన్ హైడ్రాలిక్ మిషన్ పైకి లేపుతున్నట్టు ఆ హైడ్రాలిక్ మిషన్ కూలిపోయి క్రేన్ మీద పడింది. ఆ బరువుకు క్రేన్ విరిగి పనులు జరుగుతున్న సమీపంలోనే ఉన్న ఓ భారీ భవనం మీద పడింది. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు కాని, భవనం మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. 


Similar News