Narendra Modi : గ్రామాల అభివృద్థితోనే వికసిత్ భారత్ సాధ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

గ్రామాల అభివృద్థి(Development of Villages)తోనే వికసిత్ భారత్(Developed India)సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)స్పష్టం చేశారు

Update: 2025-01-04 09:21 GMT

దిశ, వెబ్ డెస్క్ : గ్రామాల అభివృద్థి(Development of Villages)తోనే వికసిత్ భారత్(Developed India)సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్న గ్రామీణ భారత్ మహోత్సవ్ - 2025(Rural India Festival)ను ప్రధానీ నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రధాని మోడీ సందర్శించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ గ్రామీణ భారతం, వ్యవస్థాపక స్ఫూర్తి, సాంస్కృతిక వారసత్వాన్ని పెంచడమే గ్రామీణ భారత్ మహోత్సవ్‌ లక్ష్యమని తెలిపారు. గ్రామం పురోగమిస్తే, దేశం పురోగమిస్తుందని, 'వికసిత్ భారత్ కోసం ‘స్థిరమైన గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడం' అనే థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని మోదీ పేర్కొన్నారు. గ్రామీణ భారత్ మహోత్సవ్ నిర్వాహణలో నాబార్డు సహా ఇతర సంస్థలను అభినందిస్తున్నానన్నారు.

గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అధికంగా ఉండే గ్రామాలను పట్టించుకోకపోవడంతో పట్టణాలకు వలసలు పెరిగిపోగా..పట్టణ పేదరికం పెరిగిపోయయా, పల్లెలకు, పట్టణాలు మధ్య అంతరాలు పెరిగాయని, ఆర్థిక, సామాజిక అసమానతలు కూడా పెరిగిపోయాయన్నారు. దేశ ప్రగతికి గ్రామాల అభివృద్ధి ప్రధానమని గుర్తించిన తమ ప్రభుత్వం గ్రామీణ ప్రజల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని మోడీ గుర్తు చేశారు. సమ్మిళిత ఆర్ధిక విధానాలతో పల్లెల ప్రగతిని ముందుకు తీసుకెలుతున్నామన్నారు. కరోనా పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు మారుమూల గ్రామాలకు వైద్య సేవలు విస్తరించామన్నారు.

డిజిటల్ టెక్నాలాజీతో గ్రామీణ ఆసుపత్రులకు అత్యుత్తమ వైద్యులతో అనుసంధానం చేశామన్నారు. ప్రజలు ప్రస్తుతం టెలీమెడిసిన్ సేవలు పొందుతున్నారన్నారు. గ్రామాల్లో తమ ప్రభుత్వం చేపట్టిక పలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశంలో పేదరికం 26శాతం నుంచి 5శాతానికి తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, పంకజ్ చౌదరి పాల్గొన్నారు.

Tags:    

Similar News