Lok Sabha: విమాన చార్జీల నియంత్రణకు లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ

విమాన చార్జీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ శుక్రవారం లోక్‌సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు

Update: 2024-07-27 03:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: విమాన చార్జీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ శుక్రవారం లోక్‌సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, టిక్కెట్ ధరలలో హెచ్చుతగ్గుల కారణంగా వలస కార్మికులు ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ధరల్లో మార్పుల వలన ఇతర దేశాల నుంచి వచ్చే వారు, దేశీయంగా ప్రయాణాలు చేసే వారు ఎక్కువ ధరకు టిక్కెట్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నారు. ఎయిర్ ఇండియాలో జులై 27న కొచ్చిన్ నుండి దుబాయ్‌కి వెళ్లేందుకు ఎకానమీ క్లాస్‌కు రూ. 19,062. సైట్‌లో కేవలం 4 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు చూపించింది. అదే ఎయిర్‌లైన్, అదే వ్యవధి, బయలుదేరే, రాకపోకలకు అదే విమానాశ్రయం; ఆగస్టులో 31వ తేదీ రూ. 77,573ని చూపుతుంది, కేవలం 9 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక రోజు ఒక ధర, మరో రోజు ఇంకో ధర ఉండటం వలన వలస కార్మికులు ఇంటికి ఎలా వస్తారు? తమ పనికి ఎలా వెళ్తారు? వారంతా కూడా ధనవంతులు కాదు, వారిలో ఎక్కువ మంది సాధారణ కార్మికులు, వారి కుటుంబాల కోసం కష్టపడుతున్నారు. సాధారణ ఉద్యోగి రూ. 77,000 టికెట్ కొనుగోలు చేయగలరా అని కాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ లోక్‌సభలో ప్రశ్నించారు. డిమాండ్, సరఫరా మధ్య ధరలను పెంచడం కాకుండా సాధారణ ప్రజలు, వలస కార్మికుల పరిస్థితి గురించి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News