బోర్డు పరీక్షల్లో 65 లక్షల మంది స్టూడెంట్స్ ఫెయిల్ : కేంద్ర విద్యా శాఖ

గత ఏడాది జరిగిన అన్ని రకాల బోర్డు పరీక్షల్లో 65 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది.

Update: 2024-08-21 16:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : గత ఏడాది జరిగిన అన్ని రకాల బోర్డు పరీక్షల్లో 65 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. దేశంలో 56 రాష్ట్ర బోర్డులు, మూడు సెంట్రల్ బోర్డుల్లో జరిగిన పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ వివరాలు విడుదల చేశారు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తర ప్రదేశ్ కు చెందిన విద్యార్థులు అత్యధికంగా ఫెయిల్ అయ్యారు. 10 వ తరగతి బోర్డ్ పరీక్షల్లో మధ్యప్రదేశ్ విద్యార్థులు ఎక్కువగా ఫెయిల్ అయ్యారు. 12వ తరగతి ఫెయిల్యూర్ రేట్ సెంట్రల్ బోర్డులో 12% ఉండగా, స్టేట్ బోర్డుల్లో 18% ఉంది. 33 లక్షల మంది పదవ తరగతిలో ఫెయిల్ అవగా, 6 లక్షల మంది అసలు పరీక్షలకే హాజరవలేదు. కాగా ఈ ఫెయిల్ అయిన విద్యార్థుల్లో స్టేట్ బోర్డు విద్యార్థులే ఎక్కువ ఉండటం గమనార్హం. అయితే 2023 లో ప్రవేశ పెట్టిన ఎక్స్ట్రా సిలబస్ కూడా ఇందుకు ఒక కారణం అయి ఉండవచ్చు అని విద్యా శాఖ భావించింది. 


Similar News