ఐస్‌క్రీమ్ తిని ఆసుపత్రి పాలైన 55 మంది.. ఇద్దరి పరిస్థితి విషమం

Update: 2023-04-07 04:16 GMT

దిశ, వెబ్ డెస్క్:  మధ్యప్రదేశ్‌లోని ఛతల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్‌లో అనూహ్య ఘటన వెలుగుతోకి వచ్చింది. ఐస్‌క్రీమ్ తిని 55 మందికి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, వీరోచనాలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో 25 మంది పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News