456 Minors Rescued : 456 మంది మైనర్లను రక్షించిన ఆర్పీఎఫ్

దిశ, నేషనల్ బ్యూరో : మానవ అక్రమ రవాణా మాఫియా కట్టడిలో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పరిధిలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)‌ విభాగం చురుగ్గా వ్యవహరిస్తోంది.

Update: 2024-09-08 15:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మానవ అక్రమ రవాణా మాఫియా కట్టడిలో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పరిధిలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)‌ విభాగం చురుగ్గా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై మధ్యకాలంలో రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 456 మంది మైనర్లు, 42 మంది మహిళలను ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించారు. ఈక్రమంలో వారికి పలు స్వచ్ఛంద సంస్థలు, ఛైల్డ్ లైన్ సంస్థలు సహకారాన్ని అందించాయి. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మందిని అరెస్టు చేశారు.

ఆగస్టు 16 నుంచి ఆగస్టు 31 మధ్యకాలంలో రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న 44 మంది మైనర్లు, ముగ్గురు మహిళలను ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించారు. ఇలా రెస్క్యూ చేసిన వారందరినీ కుటుంబీకులకు అప్పగించేందుకు సంబంధించేందుకు ప్రొసీడింగ్స్‌ను ఎప్పటికప్పుడు మొదలుపెట్టారు.


Similar News