ఢిల్లీలో మరోసారి కలకలం రేపిన బాంబు బెదిరింపులు..!

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఈసారి హాస్పిటల్స్ ను లక్ష్యంగా చేసుకుని కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక అధికారులు తెలిపారు.

Update: 2024-05-14 06:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఈసారి హాస్పిటల్స్ ను లక్ష్యంగా చేసుకుని కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక అధికారులు తెలిపారు. నాలుగు ప్రధాన హాస్పిటల్స్ కు కాల్స్ వచ్చనట్లు వివరించారు అధికారులు.

జీటీబీ హాస్పిటల్, దాదా దేవ్ హాస్పిటల్, హెడ్గేవార్ హాస్పిటల్, దీప్ చంద్ర బంధు హాస్పిటల్‌లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. కాల్స్ ని వెరిపై చేస్తున్నట్లు వివరించారు అధికారులు. హాస్పిటల్స్ లో సెర్ట్ ఆపరేషన్ చేపట్టారు అధికారులు.

లోక్ సభ ఎన్నికల వేళ.. గత వారంలో ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత అహ్మదాబాద్ లోని పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ కి పాక్ తో లింకులు ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఈ కేసులపై విచారణ ఇప్పటికే కొనసాగుతూ ఉండగా.. మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. మరోవైపు, నిన్న జైపూర్ లోని నాలుగు పాఠశాలలకు సోమవారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే పిల్లలను ఇంటికి పంపించి.. బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌లను రంగంలోకి దించారు. ఆ తనిఖీల్లో ఏమీ తేలకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Similar News