రష్యా దాడిలో 31వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతి- జెలెన్ స్కీ
ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభం అయినప్పట్నుంచి 31 వేల మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ.
దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభం అయినప్పట్నుంచి 31 వేల మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ. కైవ్ లోని న్యూస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు జెలెన్ స్కీ. చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల సంఖ్యను అధికారికంగా ప్రకటించారు. యుద్ధంలో 31 వేల మంది సైనికులను కోల్పోయామన్నారు. ఇది తమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన వారి సంఖ్యను వెల్లడించలేదు జెలెన్ స్కీ. గాయపడిన వారి సంఖ్య చెప్తే.. అది రష్యా సైనిక ప్రణాళికకు ఉపయోగపడుతుందని ముందు జాగ్రత్త వహించారు.