30 మంది కేబినెట్, 36 మంది సహాయ..మోడీ ప్రభుత్వంలో మంత్రులు వీరే

ప్రధాని మోడీ కేబినెట్‌లో మొత్తం 72 మంది మంత్రులు ఉండగా..అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా..36 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Update: 2024-06-09 14:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ కేబినెట్‌లో మొత్తం 72 మంది మంత్రులు ఉండగా..అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా..36 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్, మనోహర్ లాల్ కట్టర్ తదితరులు ఇప్పటికే కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే వీరందరికీ ఫోర్ట్ ఫోలియోలను ఇంకా కేటాయించలేదు. మోడీ ప్రభుత్వంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు చెందిన 11 మందికి కేబినెట్‌లో చోటు దక్కగా..మొత్తం 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లభించింది. 72 మంది మంత్రుల్లో 43 మంది మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పార్లమెంటుకు ఎన్నికైన వారు ఉండగా..39 మంది ఇంతకు ముందు కేంద్రంలో మంత్రులుగా పని చేసిన వారు ఉండటం గమనార్హం. పలువురు మాజీ ముఖ్యమంత్రులు కూడా మోదీ 3.0లో భాగం కానున్నారు. అన్ని సామాజిక వర్గాలను సైతం మంత్రి మండలిలో భాగస్వామ్యం చేశారు. ఓబీసీ 27, షెడ్యూల్డ్ కులాల నుంచి 10, షెడ్యూల్డ్ తెగల నుంచి ఐదుగురు, మైనారిటీల నుంచి ఐదుగురుకి మంత్రి పదవులు దక్కాయి. 


Similar News