జమ్మూ కాశ్మీర్‌లో వరుసగా3 భూకంపాలు
మంగళవారం 5.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను వణికించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం 5.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను వణికించిన విషయం తెలిసిందే. కాగా బుధవారం తెల్లవారుజామున మరోసారి జమ్మూ, కాశ్మీర్‌లో మరో మూడు భూకంపాలు నమోదయ్యాయి. J&K యొక్క కట్రా లో తెల్లవారుజామున 2:20 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉదయం 7:56 గంటలకు 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే 3.3 తీవ్రతతో భూకంపం J&K కిష్త్వార్‌లో ఉదయం 8.29 గంటలకు సంభవించింది. వరుస భూకంపాలు రావడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొండ ప్రాంత ప్రజలు ఇంటినుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది.