Arabian Sea: అరేబియా సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్

గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్ తీరం దగ్గర ముగ్గురు నేవీ సిబ్బంది గల్లంతయ్యారు.

Update: 2024-09-03 06:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్ తీరం దగ్గర ముగ్గురు నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. సోమవారం రాత్రి అరేబియా స‌ముద్రంలో భార‌తీయ నౌకాద‌ళానికి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్ట‌ర్( ALH helicopter) అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. రెస్క్యూ కోసం వెళ్లిన ఆ హెలికాప్ట‌ర్ కూలిన ఘ‌ట‌న‌లో ముగ్గురు సిబ్బంది గ‌ల్లంతయ్యారు. హెలికాప్టర్ లో నలుగురు ఉండగా.. ఒకరిని అధికారులు కాపాడారు. సోమ‌వారం రాత్రి 11 గంట‌ల‌కు ఏఎల్‌హెచ్ రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు వెళ్లింది. మోటార్ ట్యాంక‌ర్ హ‌రి లీలా నౌక వ‌ద్ద‌కు గాయపడిన ఒకరిని రెస్క్యూ చేసేందుకు వెళ్లినప్పుడే.. హార్డ్ ల్యాండింగ్ జ‌రిగిన‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం జరగడంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగింది. మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఐసీజీ ప్రకటించింది. ఇటీవలే గుజరాత్ ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అయితే, వరదల్లో చిక్కుకున్న 67 మందిని ఏఎల్ హెచ్ ద్వారా రెస్క్యూ చేశారు. నాలుగు నౌక‌లు, రెండు విమానాల ద్వారా ముగ్గురు అధికారుల కోసం సెర్చ్ఆపరేషన్ చేపట్టినట్లు ఐసీజీ పేర్కొంది.


Similar News