రాపిడోకి వ్యతిరేకంగా.. 2 లక్షల ఆటో డ్రైవర్ల సమ్మె
బెంగుళూరులోని 21 ఆటోరిక్షా యూనియన్లు ఆందోళనకు దిగాయి. బెంగళూరు ఆటో డ్రైవర్ యూనియన్ ఫెడరేషన్ బైక్-హెయిలింగ్ మొబైల్ అప్లికేషన్ - రాపిడో పై నిషేధం కోరుతూ సమ్మె ప్రారంభించింది.
దిశ, వెబ్‌డెస్క్: బెంగుళూరులోని 21 ఆటోరిక్షా యూనియన్లు ఆందోళనకు దిగాయి. బెంగళూరు ఆటో డ్రైవర్ యూనియన్ ఫెడరేషన్ బైక్-హెయిలింగ్ మొబైల్ అప్లికేషన్ - రాపిడో పై నిషేధం కోరుతూ సమ్మె ప్రారంభించింది. ఈ క్రమంలో వైట్‌బోర్డ్ టాక్సీ సర్వీస్‌ను పూర్తిగా నిషేధించాలని ఆటో డ్రైవర్ యూనియన్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. రాపిడో వలన బెంగళూరు పట్టణంలో ఆటో రిక్షా కార్మికులుగా ఉన్న 2 లక్షల మంది జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఆటో డ్రైవర్ల సమ్మెలో 2.10 లక్షల మంది ఆటో డ్రైవర్లు నిరసనలో పాల్గొంటున్నారని.. సిటీ రైల్వేస్టేషన్‌లో నిరసన కవాతు ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నివాసాన్ని ముట్టడించాలని యోచిస్తున్నట్లు ఆదర్శ్ యూనియన్ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంజునాథ్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి వరకు బంద్ పాటింస్తుండటంతో బెంగళూరులో ఆటో సర్వీసులపై ఆధారపడిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.