BSF : బీఎస్ఎఫ్ డీజీగా దల్జీత్‌సింగ్ చౌదరి.. సశస్త్ర సీమాబల్ చీఫ్‌కు అదనపు బాధ్యతలు

దిశ, నేషనల్ బ్యూరో : బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బీ) చీఫ్ దల్జీత్ సింగ్ చౌదరికి కేంద్ర హోంశాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది.

Update: 2024-08-03 18:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బీ) చీఫ్ దల్జీత్ సింగ్ చౌదరికి కేంద్ర హోంశాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది. బీఎస్‌ఎఫ్‌కు పూర్తిస్థాయి డీజీని నియమించే వరకు ఆ హోదాలో 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దల్జీత్ కొనసాగుతారని స్పష్టం చేసింది. సశస్త్ర సీమాబల్ అనేది నేపాల్, భూటాన్ సరిహద్దుల్లోని మన దేశ భూభాగానికి రక్షణ కల్పించే భద్రతా బలగం.

ఇంతకుముందు వరకు బీఎస్‌ఎఫ్ డీజీగా వ్యవహరించిన నితిన్ అగర్వాల్, డిప్యూటీ స్పెషల్ డీజీ (వెస్ట్)గా సేవలందించిన వై.బీ.ఖురానియాలను కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా వారి మునుపటి క్యాడర్‌లకు తిప్పి పంపింది. ఇటీవలే కశ్మీర్‌లో చోటుచేసుకున్న వరుస ఉగ్రదాడి ఘటనల్లో పలువురు సైనికులు అమరులయ్యారు. ఎంతోమంది భద్రతా సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయి. ఈఘటన నేపథ్యంలోనే నితిన్ అగర్వాల్, వైబీ ఖురానియాలను బీఎస్ఎఫ్ కీలక పదవుల నుంచి తప్పించి.. మునుపటి క్యాడర్‌కు పంపించారని అంటున్నారు.

Tags:    

Similar News