10 ఉద్యోగాలకు 1800 మంది పోటీ.. క్యూ లైన్‌లో రెయిలింగ్ విరిగిపోవడంతో..

దేశంలో నిరుద్యోగం ఏ రేంజ్‌లో ఉందో మనందరికీ తెలిసిందే.

Update: 2024-07-12 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నిరుద్యోగం ఏ రేంజ్‌లో ఉందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా గుజరాత్‌లో జరిగిన ఘటన నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టింది. గుజరాత్‌ జగాడియాలోని ఓ ఇంజినీరింగ్ కంపెనీ తమ సంస్థలో 10 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటన ఇచ్చింది. కాగా ఆ యాడ్ చూసి ఏకంగా 1800 మంది ఇంటర్వ్యూ కోసమని వచ్చారు. అయితే క్యూ లైన్ లో నిల్చొన క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులు ఒక్కసారిగా పోటెత్తడంతో రెయిలింగ్ కుప్పకూలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గుజరాత్ మోడల్ ఇదేనేమో.. 10 ఉద్యోగాలకు ఇంత మందా.. స్కిల్ ఉంటే మనకు భవిష్యత్తు అంటూ కామెంట్ చేశారు.


Similar News