Uttarakhand : కేదార్‌నాథ్ నుంచి 510 మంది యాత్రికుల రెస్క్యూ
దిశ, నేషనల్ బ్యూరో : రాష్ట్రంలో వర్షాలతో అతలాకుతలమైన జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 17వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వెల్లడించారు.
దిశ, నేషనల్ బ్యూరో : రాష్ట్రంలో వర్షాలతో అతలాకుతలమైన జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 17వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వెల్లడించారు. కేదార్‌నాథ్‌లో ప్రతికూల వాతావరణం ఉన్నందున అక్కడి నుంచి దాదాపు 400 మంది యాత్రికులను లించోలికి, 110 మంది యాత్రికులను చౌమాసికి తరలించామన్నారు. కేదార్‌నాథ్ యాత్రా మార్గంలో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతోందని సీఎం ధామి వెల్లడించారు. కూలిపోయిన వంతెనలు, విద్యుత్ స్తంభాలు, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థల పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇప్పటివరకు 17 మంది చనిపోయారని, వారిలో ఇద్దరే కేదార్‌నాథ్ యాత్రికులని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వి.కె.సుమన్ వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్లలో ఆర్మీ కూడా పాల్గొంటోందని తెలిపారు. కేదార్‌నాథ్ హెలిప్యాడ్ నుంచి 570 మందిని ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారని బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సీఈవో యోగేంద్ర సింగ్ చెప్పారు. వీరిలో యాత్రికులు, సిబ్బంది, స్థానికులు ఉన్నారని పేర్కొన్నారు.