Ghulam Nabi Azad : ఆజాద్‌కి షాక్.. యూటర్న్ తీసుకున్న కీలక నేతలు..!

జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది.

Update: 2023-01-06 10:00 GMT

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన నేతగా ఉన్న గులాంనబీ ఆజాద్ గుడ్ బై చెప్పడంతో ఆయన మద్దతు దారులంతా కాంగ్రెస్‌ను వీడారు. శుక్రవారం దేశ రాజధానిలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో 17 మంది నేతలు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం తారా‌చంద్, మాజీ పీసీసీ చీఫ్ ఫీర్జాదా మహ్మద్ సయ్యద్ కూడా వీరిలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ చేరిక పార్టీకి ఉత్సాహమివ్వనుంది. భారత్ జోడో యాత్ర దేశంలో అతి పెద్ద ఉద్యమంగా మారింది. దీంతో వీరంతా తిరిగి పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నారు' అని అన్నారు.

అయితే ఇది ప్రారంభం మాత్రమేనని, యాత్ర జమ్ములోకి ప్రవేశించాక దేశాన్ని ఐక్యం చేయాలనుకునే వారు పార్టీలో చేరుతారని చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మేవారికి యాత్రలోకి ఆహ్వానం ఉందని తెలిపారు. ఇతర పార్టీ నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా, మెహబూబా సయ్యద్‌లను కూడా యాత్రలో పాల్గొంటారని అన్నారు. కొన్ని నెలల క్రితం జమ్ముకశ్మీర్ కీలక నేత గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డెమోక్రటిక్ ఆజాద్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆయనకు అండగా మద్దతుదారులు కూడా కాంగ్రెస్‌ను వీడి ఆజాద్ పార్టీలో చేరారు.

Tags:    

Similar News