సీబీఐ విచారణను నిరసిస్తూ రబ్రీదేవి ఇంటి బయట మద్ధతు దారులు, కార్యకర్తల నిరసన
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. 12 మందితో కూడిన బృందం బీహార్ మాజీ సీఎం నివాసానికి వెళ్లి విచారించింది.
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. 12 మందితో కూడిన బృందం బీహార్ మాజీ సీఎం నివాసానికి వెళ్లి విచారించింది. మరోవైపు సీబీఐ విచారణను నిరసిస్తూ రబ్రీ దేవి ఇంటి వెలుపల ఆర్జేడీ మద్ధతు దారులు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. సీబీఐ, బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. విచారణకు ముందు రబ్రీ దేవి మాట్లాడుతూ.. కేంద్రం ఎన్ని సార్లు తమను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిన తలొగ్గమని చెప్పారు. మరోవైపు సీబీఐ అధికారులు వస్తారని తాను ముందే చెప్పినట్లు ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. ఇందులో కొత్తగా జరిగిందేమి లేదని చెప్పారు. ఇలా తరుచుగా సీబీఐ వస్తూ ఉంటే, తన ఇంట్లోనే కార్యాలయాన్ని ప్రారంభించాలని అధికారులకు సూచించారు.