ఒకే రోజు 11లక్షల మొక్కలు..ఇండోర్ గిన్నీస్ రికార్డు

దేశంలోనే అత్యంత స్వచ్చమైన నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి రికార్డులకెక్కింది. అక్కడి ప్రజలు 24గంటల్లో 11లక్షల మొక్కలు నాటారు.

Update: 2024-07-14 19:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే అత్యంత స్వచ్చమైన నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి రికార్డులకెక్కింది. అక్కడి ప్రజలు 24గంటల్లో 11లక్షల మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇండోర్-ఉజ్జయిని రోడ్డులో ఉన్న రేవతి శ్రేణి కొండపై మొక్కలు నాటే ఈ ప్రొగ్రాంలో ఇండోర్‌కు చెందిన 40 మందికి పైగా ప్రవాస భారతీయులతో పాటు, 30,000 మందికి పైగా పాల్గొన్నారు. దీనిని పర్యవేక్షించడానికి 100 కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో ఇండోర్ గిన్నీస్ రికార్డుల కెక్కింది. గిన్నీస్ రికార్డును ప్రకటించే సర్టిఫికేట్‌ను సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ, ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవతో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బృందం నుంచి అందుకున్నారు. కాగా, గతంలో 9.25 లక్షల ప్లాంటేషన్‌తో అసోం రికార్డును ఇండోర్ అధిగమించింది. మరోవైపు ఇండోర్ ప్రజలతో కలిసి హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ కింద ఒక మొక్కను నాటారు.

Tags:    

Similar News