యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు.. పదిమంది మృతి

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలో పడింది.

Update: 2024-06-09 15:23 GMT

దిశ,నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో పది మంది చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రియాసి జిల్లాలో జరిగింది. శివఖోడా ఆలయాన్ని సందర్శించుకునేందుకు పలువురు యాత్రికులు బస్సులో వెళ్లారు. అక్కడ్నుంచి కత్రాకు వస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు చేపట్టారు. దీంతో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సు పూర్తిగా ధ్వంసం కాగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్మీ, పారామిలటరీ బలగాలు సహాయక చర్యలు చేపట్టారు. పూంచ్, రాజోరి, రియాసిలోని ఎగువ ప్రాంతాల్లో నక్కిన ఉగ్రవాదులే కాల్పులకు బరితెగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.


Similar News