JK Encounter: కుప్వారా జిల్లాలో ఎదురుకాల్పులు, ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని(Jammu and Kashmir) కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్(Encounter) లో ఉగ్రవాది హతమయ్యాడు. ఒక జవాన్ గాయపడినట్లు ఆర్మీ(Army) అధికారులు తెలిపారు.

Update: 2024-07-24 05:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని(Jammu and Kashmir) కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్(Encounter) లో ఉగ్రవాది హతమయ్యాడు. ఒక జవాన్ గాయపడినట్లు ఆర్మీ(Army) అధికారులు తెలిపారు. కుప్వారాలో ముష్కరులు ఉన్నారనే సమాచారం ఆధారంగా భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు(JK Police) మంగళవారం నుంచే జాయింట్ ఆపరేషన్ ను ప్రారంభించాయి. బుధవారం అనుమానాస్పద కదలికను గమనించిన అధికారులు అప్రమత్తమయ్యాయి. భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరియాయి. ఈ కాల్పుల్లో ముష్కరుడు హతమవ్వగా.. జవాన్ కు గాయాలయ్యాయి. ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

గతవారం చొరబాటుకు యత్నం

గత వారం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి చొరబాటు యత్నాన్ని భద్రతాబలగాలు భగ్నం చేశాయి. ఇద్దరు మష్కరులను మట్టుబెట్టాయి. ఉత్తర కశ్మీర్ జిల్లాలోని కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్ భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను భగ్నం చేసింది. అప్పుడు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.


Similar News