7500 స్థలాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ

దిశ, తెలంగాణ బ్యూరో: స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 7500 ప్రాంతాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా ఏబీవీపీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 1,25,000 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఏబీవీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక గ్రామం […]

Update: 2021-08-10 11:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 7500 ప్రాంతాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా ఏబీవీపీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 1,25,000 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఏబీవీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక గ్రామం ఒక జెండా నినాదంతో స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని, ఆశయాలను నేటి యువతకు, విద్యార్థులకు అందిస్తామన్నారు. దేశం సాధించిన పురోగతిని, అభివృద్ధిని, ఉన్నతిని ప్రపంచానికి చాటే విధంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం గ్రామ గ్రామాన కొనసాగిస్తామని తెలిపారు.

Tags:    

Similar News