నాట్కో ఫార్మా లాభం 73 శాతం వృద్ధి

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రముఖ ఔసధ సంస్థ నాట్కో ఫార్మా నికర లాభం 73.23 శాతం పెరిగి రూ. 203.9 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 117.7 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు గురువారం వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 827.9 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 518.9 కోట్లుగా నమోదైందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో […]

Update: 2020-11-12 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రముఖ ఔసధ సంస్థ నాట్కో ఫార్మా నికర లాభం 73.23 శాతం పెరిగి రూ. 203.9 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 117.7 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు గురువారం వెల్లడించింది.

సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 827.9 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 518.9 కోట్లుగా నమోదైందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేర్‌కు రూ. 3 చొప్పున తాత్కాలిక డివిడెండ్‌ను నాట్కో ఫార్మా సంస్థ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో నాట్కో ఫార్మా షేర్ ధర గురువారం 0.52 శాతం పెరిగి రూ. 902 వద్ద ట్రేడయింది.

Tags:    

Similar News