ఏపీ గవర్నర్ కు లేఖ రాసిన నారా లోకేష్.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 1 నుండి 9 తరగతి విద్యార్థుల పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ.. పది, ఇంటర్ పరీక్షలు యధాతథంగా నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. పరీక్షల విషయంలో జోక్యం చేసుకొని రద్దు చేయడమో, వాయిదా వేయడంతో చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన […]

Update: 2021-04-26 04:34 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 1 నుండి 9 తరగతి విద్యార్థుల పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ.. పది, ఇంటర్ పరీక్షలు యధాతథంగా నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. పరీక్షల విషయంలో జోక్యం చేసుకొని రద్దు చేయడమో, వాయిదా వేయడంతో చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన లేఖతో పాటు పరీక్షల అంశంలో ఆన్ లైన్ ద్వారా వచ్చిన అభిప్రాయాలతో కూడిన 1,778 పేజీలను జతచేసి పంపానని లోకేశ్ వెల్లడించారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు దాదాపు 16.3 లక్షల మంది విద్యార్థులకు హాజరు కానున్నారని, కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుంటే పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు.

Tags:    

Similar News