అది నేరమైతే ఏ శిక్షకైనా సిద్ధం -నారా లోకేష్

దిశ, ఏపీ బ్యూరో: కష్టాల్లో ఉన్న రైతుల్ని పరామర్శించడం.. రైతులకు న్యాయ చేయాలని పోరాడడం జగన్ రెడ్డి దృష్టిలో నేరమైతే తాను ఏ శిక్షకైనా సిద్దమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం ట్విటర్లో పేర్కొన్నారు. ఈ నేరంపై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవన్నారు. అందుకే కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపానంటూ తనపై కేసులు బనాయించినట్లు చెప్పారు. వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే […]

Update: 2020-10-27 10:44 GMT

దిశ, ఏపీ బ్యూరో: కష్టాల్లో ఉన్న రైతుల్ని పరామర్శించడం.. రైతులకు న్యాయ చేయాలని పోరాడడం జగన్ రెడ్డి దృష్టిలో నేరమైతే తాను ఏ శిక్షకైనా సిద్దమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం ట్విటర్లో పేర్కొన్నారు. ఈ నేరంపై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవన్నారు. అందుకే కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపానంటూ తనపై కేసులు బనాయించినట్లు చెప్పారు.

వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే తనను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. కష్టాల్లో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా. ప్రతి గడపా తొక్కుతా. బాధితులకు భరోసానిస్తానని లోకేష్ ట్వీట్చేశారు.

Tags:    

Similar News