సృజనపై టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశంసలు

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ (జీవీఎంసీ) ఐఏఎస్ అధికారిణి గుమ్మళ్ల సృజనపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఒక నెల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన సృజన, మెటర్నటీ లీవ్ తీసుకోకుండా.. విధుల్లో చేరారు. దీనిపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన నారా లోకేశ్.. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఆమె ఓ సైనికురాలిలా విధుల్లో చేరారని, మనందరి గౌరవాన్ని పొందడానికి ఆమె నిజంగా అర్హురాలని కొనియాడారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడానికి బిడ్డను ఎత్తుకుని […]

Update: 2020-04-16 01:18 GMT
సృజనపై టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశంసలు
  • whatsapp icon

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ (జీవీఎంసీ) ఐఏఎస్ అధికారిణి గుమ్మళ్ల సృజనపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఒక నెల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన సృజన, మెటర్నటీ లీవ్ తీసుకోకుండా.. విధుల్లో చేరారు. దీనిపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన నారా లోకేశ్.. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఆమె ఓ సైనికురాలిలా విధుల్లో చేరారని, మనందరి గౌరవాన్ని పొందడానికి ఆమె నిజంగా అర్హురాలని కొనియాడారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడానికి బిడ్డను ఎత్తుకుని కార్యాలయానికి ఆమె వెళ్లడంపై ప్రశంసలు కురిపించారు. అలాంటి అధికారులే సిబ్బందికి ఆదర్శమని ఆయన కొనియాడారు.

tags:gvmc, commissioner, ap, visakhapatnam, ias officer, srujana ias

Tags:    

Similar News