మంత్రి కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ ఇద్దరి నేతలపై హెరిటేజ్ సంస్ధ పరువునష్టం దావా వేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ శుక్రవారం జరిగింది. అయితే విచారణకు మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులు హాజరుకాకపోవడంతో వచ్చే వాయిదాకు రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ […]
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ ఇద్దరి నేతలపై హెరిటేజ్ సంస్ధ పరువునష్టం దావా వేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ శుక్రవారం జరిగింది. అయితే విచారణకు మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులు హాజరుకాకపోవడంతో వచ్చే వాయిదాకు రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ కంపెనీ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుంది. ఈ విచారణకు ఇద్దరు నేతలు గైర్హాజరయ్యారు. ఫిబ్రవరి 5న ఇద్దరు నేతలను విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా హాజరుకాలేదు. మరోవైపు గత వాయిదా సమయంలో హెరిటేజ్ కంపెనీ ప్రతినిధి సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగైతే కేసు ముందుకు వెళ్లడం కష్టమని గత విచారణలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.