హుజూరాబాద్ బైపోల్.. ముగిసిన కీలక ఘట్టం

దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నిక సమరంలో కీలక గట్టం ముగిసింది. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ అనంతరం కొద్ది సేపటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.  శుక్రవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి ఈటల ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్ల సమర్పించేందుకు చివరి రోజు కావడంతో ఆర్డీవో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ప్రధాన […]

Update: 2021-10-08 04:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నిక సమరంలో కీలక గట్టం ముగిసింది. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ అనంతరం కొద్ది సేపటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి ఈటల ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్ల సమర్పించేందుకు చివరి రోజు కావడంతో ఆర్డీవో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేసేందుకు రావటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో 26 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మంత్రి హరీశ్‌రావుతో కలిసి నామినేషన్‌ వేయగా.. పీసీసీ ఉపాధ్యక్షులు దామోదర రాజనర్సింహ పొన్నం ప్రభాకర్‌తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్‌ దాఖలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఈనెల 30వ తేదీన జరగనుంది.

Tags:    

Similar News