చినుకు పడితే చెరువును తలపిస్తున్న నల్లగొండ రోడ్లు..
దిశ, నల్లగొండ: వర్షం కురుస్తుందంటేనే నల్లగొండ జిల్లాకేంద్రం వాసులు బెంబేలెత్తుతున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతూ జిల్లా కేంద్రంలోని ఏ కాలనీల రోడ్లు చూసినా చెరువులను తలపిస్తున్నాయి. అసలే వర్షాకాలం కావడం, నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులతో పాటు, వీధులు జలమయం అవుతున్నాయి. ఈ సమస్యతో నల్లగొండ జిల్లా ప్రజలు సంవత్సరాలుగా బాధపడుతున్నా పాలకులు, అధికారులకు ఎటువంటి పట్టింపులేకుండా పోతోంది. మోకాళ్ల లోతులో నీళ్లు రోడ్లపై చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ చిన్న చినుకులు కురిసినా పానగల్ […]
దిశ, నల్లగొండ: వర్షం కురుస్తుందంటేనే నల్లగొండ జిల్లాకేంద్రం వాసులు బెంబేలెత్తుతున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతూ జిల్లా కేంద్రంలోని ఏ కాలనీల రోడ్లు చూసినా చెరువులను తలపిస్తున్నాయి. అసలే వర్షాకాలం కావడం, నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులతో పాటు, వీధులు జలమయం అవుతున్నాయి. ఈ సమస్యతో నల్లగొండ జిల్లా ప్రజలు సంవత్సరాలుగా బాధపడుతున్నా పాలకులు, అధికారులకు ఎటువంటి పట్టింపులేకుండా పోతోంది. మోకాళ్ల లోతులో నీళ్లు రోడ్లపై చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ చిన్న చినుకులు కురిసినా పానగల్ చౌరస్తా.. చేపల మార్కెట్ పూర్తిగా జలమయం అవుతోంది.
సూర్యాపేట, నకిరేకల్, కట్టంగూరు మండలాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం నల్లగొండకు రావాలంటే అది ఒక్కటే ప్రధాన రహదారి. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఎల్లమ్మ గుడి, ఫ్లై ఓవర్ వరకూ రోడ్డుమొత్తం నీటితో మునిగిపోవడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నల్లగొండ బస్టాంట్, క్లాక్ టవర్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, ఆర్ ఎండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి దేవరకొండ రోడ్డు, క్లాక్ టవర్ నుంచి హైదరాబాద్ రోడ్డు, రైల్వే స్టేషన్ వెంట ఉండే శ్రీనగర్ వంటి కాలనీలు జలమయం అవుతున్నాయి. అసలే కరోనా సమయంలో ఇళ్లముందే డ్రైనేజీతో కలసిన వర్షపు నీరు ఇళ్లఎదుటే రోజుల త్వరబడి నిల్వ ఉంటుండంతో రోగాలు ప్రభలే అవకాశముందంటూ నల్లగొండ వాసులు భయపడుతున్నారు.