అట్టహాసంగా ప్రారంభమైన నాగోబా జాతర
దిశ, వెబ్‌డెస్క్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా క్షేత్రంలో మహాపూజ నిర్వహించారు. హస్తినమడుగు నుంచి తెచ్చిన పవిత్ర గంగా జలంతో నాగదేవునికి మెస్రం వంశీయులు అభిషేకం చేశారు. తుడుం మోగించి నాగదేవుని పూజకు పూజారులు అంకురార్పణ చేశారు. అనంతరం కొత్త కోడళ్ల భేటీ నిర్వహించారు. నాగోబాను ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ గెడాం నగేశ్, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ విష్ణువారియర్ దర్శించుకున్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా క్షేత్రంలో మహాపూజ నిర్వహించారు. హస్తినమడుగు నుంచి తెచ్చిన పవిత్ర గంగా జలంతో నాగదేవునికి మెస్రం వంశీయులు అభిషేకం చేశారు. తుడుం మోగించి నాగదేవుని పూజకు పూజారులు అంకురార్పణ చేశారు. అనంతరం కొత్త కోడళ్ల భేటీ నిర్వహించారు. నాగోబాను ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ గెడాం నగేశ్, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ విష్ణువారియర్ దర్శించుకున్నారు.
మర్రిచెట్టు విడిది సమీపంలోని కోనేరు నుంచి వాయిద్యాలతో నాగోబా విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. నాగోబాను ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్టించారు. దీంతో జాతర మొదలైనట్టుగా మెస్రం గిరిజన పెద్దలు ప్రకటించడంతో సందడి నెలకొంది. గురువారం అర్ధరాత్రి వేళ మహాపూజలతో నాగోబా జాతరను ఘనంగా ప్రారంభించారు. వారం రోజుల పాటు నాగోబా జాతర కొనసాగనుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.