నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

దిశ, వెబ్ డెస్క్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికారం చేజిక్కించుకోవాలని అటు టీఆర్ ఎస్ ఇటు బీజేపీ, కాంగ్రేస్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ చేసిన అధికారులు, కరోనా నిబంధనలను పాటించేలా చూస్తూ, పోలింగ్ ప్రక్రియను ఉదయం ప్రారంభించారు. నియోజకవర్గంలో మొత్తం 2,20, 300 మంది ఓటర్లు ఉన్నారు.ఇందులో పురుషులు 1,09,228 ఉండగా మహిళలు 1,11, 072 మంది ఉన్నారు. మొత్తం […]

Update: 2021-04-16 21:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికారం చేజిక్కించుకోవాలని అటు టీఆర్ ఎస్ ఇటు బీజేపీ, కాంగ్రేస్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ చేసిన అధికారులు, కరోనా నిబంధనలను పాటించేలా చూస్తూ, పోలింగ్ ప్రక్రియను ఉదయం ప్రారంభించారు. నియోజకవర్గంలో మొత్తం 2,20, 300 మంది ఓటర్లు ఉన్నారు.ఇందులో పురుషులు 1,09,228 ఉండగా మహిళలు 1,11, 072 మంది ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఐదువేల 535 మంది సిబ్బందిని నియమించినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఉపఎన్నికలో మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ జరుగనుంది. మొత్తం 2.20 లక్షల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరుగనుండగా, మే 2న ఓట్ల లెక్కింపు జరుగనున్న సంగతి తెలిసిందే. అలానే ఉపఎన్నికల పోలీంగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కరోనానేపథ్యంలో ఎన్నికల సిబ్బంది తప్పకుండా మాస్క్‌ ధరించాలని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో శానిటైజర్లతో పాటు ఇద్దరు ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కోవిడ్ పేషెంట్లకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Tags:    

Similar News