సామ్-చైతు విడాకులపై స్పందించిన నాగార్జున.. సోషల్ మీడియాలో ఎమోషనల్
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ వార్తలకు చై–సామ్ ఫుల్స్టాప్ పెట్టారు. విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వేర్వేరుగా ప్రకటించారు. దీనిపై నాగార్జున స్పందించాడు. ‘‘సమంత మా ఫ్యామిలీలో ఉన్న రోజులన్నీ అద్భుత తీపి గుర్తులు. సామ్-చైతు ఇద్దరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. ఇద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. బరువెక్కిన హృదయంతో ఈ విషయం చెప్తున్నాను. సామ్-చై మధ్య జరిగినది చాలా […]
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ వార్తలకు చై–సామ్ ఫుల్స్టాప్ పెట్టారు. విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వేర్వేరుగా ప్రకటించారు. దీనిపై నాగార్జున స్పందించాడు. ‘‘సమంత మా ఫ్యామిలీలో ఉన్న రోజులన్నీ అద్భుత తీపి గుర్తులు. సామ్-చైతు ఇద్దరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. ఇద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. బరువెక్కిన హృదయంతో ఈ విషయం చెప్తున్నాను. సామ్-చై మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య మరియు భర్త మధ్య జరిగేది వ్యక్తిగతమైనది. సామ్ మరియు చై ఇద్దరూ నాకు ప్రియమైనవారు. నా కుటుంబం ఎల్లప్పుడూ సామ్‌తో గడిపిన క్షణాలను ఎంతో ఆదరిస్తుంది.’’ అంటూ సోషల్ మీడియాలో నాగార్జున పేర్కొన్నారు.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2021