‘రాధేశ్యామ్’ రొమాంటిక్ లుక్‌కు మాస్క్‌లు!
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని వైద్యలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా ప్రభావం సినిమా షూటింగ్‌లపైనా పడింది. చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే ముద్దు సన్నివేశాల్లో నటించమని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు కూడా. దర్శకుడు రవిబాబు అయితే.. హీరో హీరోయిన్లను హగ్ చేసుకునే సీన్లను ఇలా చిత్రీకరించాలేమో అంటూ.. ఓ వీడియోను సైతం విడుదల చేశారు. అయితే ఇది కాస్త తాజాగా విడుదలైన […]
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని వైద్యలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా ప్రభావం సినిమా షూటింగ్‌లపైనా పడింది. చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే ముద్దు సన్నివేశాల్లో నటించమని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు కూడా. దర్శకుడు రవిబాబు అయితే.. హీరో హీరోయిన్లను హగ్ చేసుకునే సీన్లను ఇలా చిత్రీకరించాలేమో అంటూ.. ఓ వీడియోను సైతం విడుదల చేశారు. అయితే ఇది కాస్త తాజాగా విడుదలైన ప్రభాస్- పూజా హెగ్డే రొమాంటిక్ స్టిల్ ‘రాధే శ్యామ్’ పోస్టర్‌ను కూడా తాకింది. ఆ స్టిల్‌ను కొవిడ్-19 రూల్స్‌కు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో వైరల్ అవుతోంది.
రెబల్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ప్రభాస్ 20వ మూవీ ఫస్ట్‌లుక్.. జులై 10న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ప్రభాస్- పూజా హెగ్డే రొమాంటిక్ స్టిల్ రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన 24 గంటల్లోనే ఫస్ట్‌లుక్ పోస్టర్ 6.3 మిలియన్లకు పైగా ట్వీట్స్ సాధించి ట్విట్టర్ వేదికపై కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ మేరకు డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ మేకర్స్ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇది చూసిన అస్సాంలోని నాగాన్ పోలీసులు ప్రభాస్, పూజలకు మాస్క్‌లు జోడించారు. అంతేకాదు.. ‘మీ ప్రియమైన వారు బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్ పెట్టుకోమని చెప్పండి. మేము ప్రభాస్‌కు చెప్పడానికి ప్రయత్నించాం.. కానీ విఫలమయ్యాం. అందుకే ఇలా ఫొటోషాప్‌లో ఎడిట్ చేసి ఈ పోస్టర్ ద్వారా సందేశం పంపుతున్నాం’ అంటూ సరదా ట్వీట్ పెట్టారు. ఇందులో ఒరిజినల్ పోస్టర్‌లో కనిపించిన ప్రభాస్- పూజా హెగ్డేలకు మాస్క్‌లు పెట్టేయడం గమనార్హం. దర్శక ధీరుడు జక్కన్న కూడా మాహిష్మతి రాజ్యంలోనూ మాస్కులు పెట్టుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.