బతుకుపాటకు కరోనా కాటు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా మొత్తం ఆర్థిక వ్యవస్థే కుదేలైపోయింది. దీంతో ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు తప్పడంలేదు. పాపం.. ఆఖరికీ ఓ వీధి గాయకుడిని కూడా వదల్లేదు. అదేం రోగమో నాకు తెలియదుగానీ, దాని కారణంగా నా బతుకుదెరువు ఆగమైంది. ఇప్పుడు నేను ఎలా బతకాలో.. నా కుటుంబాన్ని ఎలా పోషించాలో అనేది నాకు అర్థమవ్వడంలేదంటూ వాపోతున్నాడు. అతడి ధీనగాథపై ఓ ప్రత్యేక కథనం. చంఢీగర్కు చెందిన ఇతని పేరు జోగ్రాజ్ దౌలత్నాథ్(70). ఇతను వీధి గాయకుడు. […]

Update: 2020-03-19 04:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా మొత్తం ఆర్థిక వ్యవస్థే కుదేలైపోయింది. దీంతో ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు తప్పడంలేదు. పాపం.. ఆఖరికీ ఓ వీధి గాయకుడిని కూడా వదల్లేదు. అదేం రోగమో నాకు తెలియదుగానీ, దాని కారణంగా నా బతుకుదెరువు ఆగమైంది. ఇప్పుడు నేను ఎలా బతకాలో.. నా కుటుంబాన్ని ఎలా పోషించాలో అనేది నాకు అర్థమవ్వడంలేదంటూ వాపోతున్నాడు. అతడి ధీనగాథపై ఓ ప్రత్యేక కథనం.

చంఢీగర్కు చెందిన ఇతని పేరు జోగ్రాజ్ దౌలత్నాథ్(70). ఇతను వీధి గాయకుడు. అంతేకాదు ఇతను సంగీతకారుడు. తన జీవనోపాధి కోసం రోజూ చంఢీగర్ సెక్టార్ 17లోని పాపులర్ ప్లాజాకు వస్తుంటాడు. అనంతరం అక్కడున్న వీధుల్లో తిరుగుతూ అక్కడ ఒకచోట మధ్యలో కూర్చుని సంగీతం జోడిస్తూ జానపద పాటలు పాడుతూ జనాలను ఆకర్షిస్తాడు. అది మెచ్చిన ఆ జనాలు అతనికి ఎంతోకొంత డబ్బు ఇస్తుంటారు. ఆ జనాలిచ్చే డబ్బులను తీసుకెళ్లి తాను, తన కుటుంబం కడుపునింపుతుంటాడు. ఇలా గత 38 ఏళ్ల నుంచి ఇలా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావడంలేదు. దీంతో వీధులన్నీ చిన్నబోయాయి. జోగ్రాజ్ ఎప్పటిలాగే వచ్చి వీధుల వెంట పాటలు పాడుతున్నాడు. కానీ, అక్కడ ఎవరూ కనిపించడంలేదు… ఆయనకు ఒక్క రూపాయి కూడా దొరకడంలేదు. దీంతో ఆయనకు పూట గడవడం కష్టంగా ఉంది. తన కుటుంబం కూడా పస్తులుండాల్సి వస్తోంది. ఇదేం మాయరోగమో అర్థంకావడంలేదు. కానీ, ఎప్పుడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వాపోతున్నాడు. పదేళ్ల వయసు నుంచే ఆయన పాటలు పాడుతూ ఉన్నాడు. చంఢీగర్ సమీపంలోని మురికివాడల్లో నివసించే ఇతనికి ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. నాకు ఆధార్ కార్డు ఉన్నా కూడా జనన ధృవీకరణ పత్రం లేదని ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం నా బతకుదెరువు ఆగమైందని, పూట గడవడం కూడా కష్టంగా ఉన్నందున తనకు, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ అక్కడి సర్కారుకు జోగ్రాజ్ మొర పెట్టుకుంటున్నాడు.

Tags : Chandigarh, jograj Daulat Nath, street singer, Popular Plaza, folk song

Tags:    

Similar News