ఇది ప్రతి ఆడపిల్ల ఇంట్లో జరిగే కథ

దిశ,వెబ్‌డెస్క్: అమ్మాయి పెళ్లికై నిశ్చయ తాంబూలాలు పంచుకున్నారు ఆరోజున. అది గొప్పింటి సంబంధం కావడంతో అమ్మాయి తండ్రి శర్మ ఎంతో ఆనందించాడు. కాబోయే అల్లుడు, అతని తల్లిదండ్రులు చాలా మంచివారు. దీంతో శర్మకు ఎంతో భారం తగ్గినట్లు అనిపించింది. పెళ్లికి ముందు పెళ్లి కూతురు తండ్రి శర్మ వియ్యంకుడు వాళ్లింటికి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆరోజు శర్మ ఆరోగ్యం బాగలేదు. మొదటి సారి కావడంతో కాదనలేకపోయాడు. వరుడి తరుపు వాళ్లు శర్మను ఇంట్లోకి సాదరంగా స్వాగతం పలికారు. […]

Update: 2021-01-28 21:38 GMT

దిశ,వెబ్‌డెస్క్: అమ్మాయి పెళ్లికై నిశ్చయ తాంబూలాలు పంచుకున్నారు ఆరోజున. అది గొప్పింటి సంబంధం కావడంతో అమ్మాయి తండ్రి శర్మ ఎంతో ఆనందించాడు. కాబోయే అల్లుడు, అతని తల్లిదండ్రులు చాలా మంచివారు. దీంతో శర్మకు ఎంతో భారం తగ్గినట్లు అనిపించింది. పెళ్లికి ముందు పెళ్లి కూతురు తండ్రి శర్మ వియ్యంకుడు వాళ్లింటికి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆరోజు శర్మ ఆరోగ్యం బాగలేదు. మొదటి సారి కావడంతో కాదనలేకపోయాడు. వరుడి తరుపు వాళ్లు శర్మను ఇంట్లోకి సాదరంగా స్వాగతం పలికారు. వచ్చిన విషయం గురించి మాట్లాడుతుండగా తేనీరు వచ్చింది. శర్మకు మధుమేహం కావడంతో షుగర్ పదార్ధాలకు దూరంగా ఉంటారు. అయితే మొహమాటంతోనే వరుడింటివారు ఇచ్చిన టీని తాగేందుకు మొహమాటంగానే అందుకున్నాడు శర్మ. మొదటి గుటకవేస్తూనే ఓకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అందులో పంచదార లేదు సరికదా..!తనకిష్టమైన యాలకుల పొడిని కలిపారు. మా ఇంట్లో టీ ఎలాగైతే చేస్తారో వీళ్లింట్లో కూడా టీ అలాగే చేస్తారేమోనని అనుకున్నారాయన. మధ్యాహ్నం భోజనం చేశారు. అది అచ్చం తమ ఇంటి వంటలాగే ఉంది. వెంటనే ఏం బయలుదేరుతారు. కొంచెం విశ్రాంతి తీసుకోండంటూ పడకగదికి తీసుకెళ్లారు. అక్కడ కూడా తాను తనింట్లో ఎలా పలచటి దుప్పటి కప్పుకొని పడుకుంటారో ఇక్కడ కూడా అలాంటి దుప్పటి అందించారు. సౌకర్యంగా ఉంది. కునుకు తీసి లేచే సరికి రాగి చెంబుతో నీళ్లిచ్చారు తాగడానికి. ఇక భయలు దేరేముందు అడగకుండా ఉండలేకపోయారు శర్మ. నేను ఏం తాగుతాను. నా ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం మంచింది. నేను ఎలా పడుకుంటాను. ఇవ్వన్నీ మీకెలా తెలుసంటూ కాబోయే అల్లుడి కుటుంబసభ్యుల్ని అడిగాడు. దీంతో అబ్బాయి వాళ్ల అమ్మ ఇలా అంది. నిన్నరాత్రి మీ అమ్మాయి ఫోన్ చేసి మీ గురించి అన్నీ చెప్పింది. మానాన్నగారు మొహమాటపడతారు. వారి గురించి మీరే శ్రద్ధ తీసుకోవాలని కోరింది. ఇది విన్న శర్మగారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు. లలిత మా అమ్మ చనిపోలేదే. ఏమిటండి మీరు మాట్లాడుతుంది. అవును లలిత నన్ను కంటికి రెప్పలా చూసుకునే నా తల్లి బ్రతికే ఉంది నా కూతురి రూపంలో. అలా జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు నిండిన కళ్లతో. ఇది కథే కావొచ్చు.కానీ ఇది ప్రతీ ఆడపిల్ల ఇంట్లో నిజజీవితంలో జరిగే రియల్ స్టోరీ అని చెప్పే ప్రయత్నం చేసింది ఆరేళ్ల చిన్నారి.

నైజీరియాలోని ఇకెరే-ఎకిటి ప్రాంతానికి చెందిన తైవో లాంగే నా కూతురికి నేనంటే ఎంత ప్రేమ చూడండి అంటూ ఆరేళ్ల తైవో కూతురు స్కూల్ కి వెళుతూ ఓ లేఖ రాసి వెళ్లింది. ఆ లేఖను తండ్రి తైవో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నాన్న నీకు తెలుసు ఈరోజు నా బర్త్ డే అని. నువ్వు నాకు ప్రామిస్ చేశావు. నా ఆరవ పుట్టిన రోజు నేను చదువుకునేందు ట్యాబ్లెట్ కొనిస్తానని. ఈ రోజు నా ఆరవ పుట్టిన రోజు. నాకు తెలుసు నాన్న నువ్వు నా పుట్టిన రోజుకి ట్యాబ్లెట్ కొనివ్వలేవని. ఎందుకంటే కరోనా కారణంగా నీ దగ్గర డబ్బులు లేవు. జాబ్ లేదు. నాన్న నువ్వు కంగారు పడకు. దేవుడు నీకు మంచి జాబ్ తో పాటు డబ్బుల్ని కూడా ఇస్తాడు అంటూనే తాను చదువుకునేందుకు ట్యాబ్లెట్ కావాలని మరోసారి తండ్రిని కోరింది. నువ్వు ఇంట్లో ఉన్న కోడిని చంపకు. దాన్ని అమ్మి నాకు ట్యాబ్లెట్ తీసుకొని రా నాన్న. లవ్యూ అంటూ ఆరేళ్ల చిన్నారి తన తండ్రికి లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ ను లక్షా 46వేల మందికి పైగా లైక్ చేయగా 27వేల 90మంది షేర్ చేశారు. 3వేల 600మంది కామెంట్ చేశారు.

https://twitter.com/longe_taiwo/status/1354721154926338049

Tags:    

Similar News